NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం 

1 min read

ఆలూరు న్యూస్ నేడు : మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వారి వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం  ఆలూరు నియోజకవర్గంలోని ప్రజల నుండి 60వేల సంతకాల పత్రాలను ఆర్​బి గెస్ట్ హౌస్ నందు సుజుకి వాహనంలో జెండా ఊపి సాగనంపిన వైఎస్ఆర్ సీపీ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి …!ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మాట్లాడుతూ…..!!జగన్మోహన్ రెడ్డి  17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే, ఈ చంద్రబాబు వాటిని ప్రవేటీకరణ చేయడం దారుణంమని తెలిపారు..జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. కూటమి నాయకులు మరియు సమాన్య ప్రజలు అందరు కూడా ముందుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని  అందరు కూడా కోటి సంతకాలు చేస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క లబ్ధిదారుని కూడా ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదు.ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి అనేది వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినారు కూటమి నాయకులు మాత్రం మేం కట్టించామని అంటున్నారు.  వాళ్లుకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదన్నారు . కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చడం లేదన్నారు.ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరం చేస్తే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అర్థం కావడం లేదు అన్నారు.చిప్పగిరి మండలంలో నగరడోన రిజర్వాయర్ 50 శాతం పనులు పూర్తి అయినాయి, కూటమి ప్రభుత్వం మిగతా నిధులను విడుదల చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ, నాయకులు కార్యకర్తలు బివిఆర్​ అభిమానులు పాల్గొనారు.

About Author