NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదపాడు శాఖ గ్రంథాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి జయంతి వేడుకలు

1 min read

ఆయన చేసిన సేవలు పలువురు కొనియాడారు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు  ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు,వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది,రాజ   నీతిజ్ఞుడు,సి.ఆర్.రెడ్డి గా ప్రసిద్ధుడైన డాక్టర్ “కట్టమంచి రామలింగారెడ్డి” జయంతి సందర్భంగా ఆయన చిత్రపటమునకు శ్రీకృష్ణ గురుకులం స్కూల్ హెచ్.ఎం ఆర్.బెంజిమాన్, గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు బుధవారం గ్రంధాలయంలో  పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి హెచ్.ఎం    ఆర్.బెంజిమెన్ ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరు జిల్లాలో ది :10/12/1880లో జన్మించినారు . ది:24/02/1951 లో మరణించినారని ఆయన మంచి రచయిత,తెలుగులో ముసలమ్మ మరణం అనే కావ్యాన్ని మరియు భారత అర్థశాస్త్రం,కవిత్వ తత్వ విచారం అనే రచనలు రచించారని అలాగే ఆంగ్లంలో కూడా రచనలు రచించారని శాసనసభ్యులుగా కూడా పని చేశారని. ఆయన పేరుమీద ఏలూరు పట్టణంలో సర్.సి.ఆర్.రెడ్డి పాఠశాల మరియు కళాశాల,విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాల్లో చురుకుగా పని చేశారని ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపనలో కీలక పాత్ర పోషించి తొలి వైస్ ఛాన్సలర్ గా విశిష్ట సేవలు అందించారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాఠకులు,సిబ్బంది, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొనినారు. అనంతరం పాల్గొనిన విద్యార్థులకు స్నాక్స్ పంచిపెట్టడం జరిగిoది.

About Author