NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను   డోన్ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిఆకస్మికంగా పరిశీలించారు.ఈసందర్భంగా శుక్రవారం  విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు, మరియు విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపు ని ఏర్పాటు చేయమని డాక్టర్స్ ని ఆదేశించారు, విద్యార్థులకు బెడ్స్ ను పంపిణీ చేశారు.ఆహారం వండుతున్న విధానం, శుభ్రత, విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం యొక్క రుచి మరియు నాణ్యతపై ఎమ్మెల్యే  ప్రత్యక్షంగా ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి వారిఅభిప్రాయాలను తెలుసుకున్నారు.భోజనం నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా, విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు అధికారులను, సిబ్బందిని ఎమ్మెల్యే  ఆదేశించారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, సీనియర్ తెదేపా నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఎద్దుల దోడ్డి ప్రభాకర్ రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా పీర్, బత్తుల రామెశ్వర రెడ్డి, చల్లా అనుదిప్ , కడితం ప్రతాప్ రెడ్డి, ఎస్ కె వలి,సందిప్, మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author