NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ..

1 min read

కర్నూలు ఎస్పీ   విక్రాంత్ పాటిల్  ఐపియస్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 128 ఫిర్యాదులు.

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ  క్యాంపు కార్యాలయంలో  కర్నూలు ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్  సోమవారం  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ  మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 128 ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …1) 2025 లో డిఎస్సీ గవర్నమెంట్ ఎస్జీటీ టీచర్ పోస్ట్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 16 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని కర్నూలు, ఏ. క్యాంపు కు చెందిన ఒక మహిళ  ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా , సిఐలు రామంజులు, రామయ్య నాయుడు, పార్థసారథి, రామకృష్ణ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *