వెలుగోడులో … తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.
కర్నూలు, న్యూస్ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వెలుగోడు పట్టణం, రాజావీధిలో వెలసిన శ్రీరామాలయం నందు ( అమ్మవారిశాల ప్రక్కన) ప్రముఖ పురాణపండితులు శ్రీనివాస రామానుజదాసుచే మంగళవారం సాయంత్రం 6 గం. నుండి శ్రీమద్రామాయణము, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సత్సంగం సభ్యులతో కలిసి కార్యక్రమం జరుగు ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సనాతన వైదిక ధర్మాన్ని గ్రామ గ్రామాన వ్యాప్తి చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. వెలుగోడులోని వివిధ ధార్మిక సంస్థలు, భజన బృందాలు, సాంస్కృతిక బృందాలు అందరు కూడా ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొన వలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామాలయం కమిటీ అధ్యక్షులు లాలం శ్రీనివాసులు, వాసవీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం కార్యదర్శి తాళ్లూరి సంజీవరాయ ప్రసాద్, వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం అధ్యక్షులు లాలం సుధాకర్, సత్సంగం సభ్యులు టి. కళ్యాణి, శారదమ్మ, లక్ష్మీదేవి, మల్లీశ్వరి, కలావతి, లక్ష్మిసుభాషిణి, శారదా, సుచిత్ర, పుష్పావతి, సత్యావతి, లత, కాంతమ్మ, దేవలక్షుమ్మ, సుబ్బరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.


