NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“హిట్ అండ్ రన్ కేసులపై డిస్టిక్ లెవెల్ అధికారులతో సమీక్ష సమావేశం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు  బి. లీలా వెంకట శేషాద్రి    న్యాయ సేవా సదన్ నందు “హిట్ అండ్ రన్ కేసులపై శనివారం డిస్టిక్ లెవెల్ అధికారుల మానిటరింగ్ మీటింగ్” నిర్వహించడం జరిగినది. కర్నూలు, మరియు నంద్యాల జిల్లాల్లోని హిట్ అండ్ రన్ కేసులను  త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం త్యరగా అందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసుల వేగవంతమైన ప్రక్రియకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీలతో సమన్వయం చేసుకొని హిట్ అండ్ రన్ కేసుల  క్లైముల వేగవంతమైన ప్రక్రియ కోసం మరియు జనరల్ ఇన్సూరెన్స్లకు క్లైములను సమర్పించడం కోసం రెవిన్యూ, పోలీస్ మరియు బీమా కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని అలాగే హిట్ అండ్ రన్ కేసుల బాధితులకు లేదా వారిపై ఆధారపడిన వారికి అర్హత ప్రకారం పరిహారం చెల్లింపు జరిగేలా చూడాలన్నారుఈ కార్యక్రమంలో  డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్స్, డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, డిటి ఆర్ బి అధికారులు, డి ఎం అండ్ హెచ్ ఓ అధికారులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది.

About Author