NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు ఆర్టీసీ గ్యారేజీలో రోడ్ సేఫ్టీ పై కార్యక్రమం

1 min read

కార్యక్రమములో  ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం,సుఖ ప్రదమని వెల్లడి

ప్రమాద రహితంగా వాహనాలు నడిపిన డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు,సత్కారం

హాజరైన మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జగదీష్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏలూరు ఆర్టీసీ గ్యారేజీ లో నిర్వహించిన ‘రోడ్ సేఫ్టీ మీటింగ్’కు ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, రోడ్డు భద్రతపై పలు కీలక సూచనలు చేశారు.ప్రజల నమ్మకం  ఆర్టీసీ “ఆర్టీసీ డ్రైవర్లు అంటేనే ప్రజల్లో ఒక ప్రత్యేకమైన నమ్మకం మరియు భరోసా ఉంది. ఎంత ఆలస్యమైనా సురక్షితంగా గమ్యం చేరుస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకుంటారు. నేడు ప్రైవేటు బస్సులకు ధీటుగా ఆర్టీసీ లో అన్ని సౌకర్యాలు లభ్యమవుతున్నాయన్నరు.ఆర్టీసీ డ్రైవర్లు అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన వారు కావడం వల్లే రహదారి ప్రమాదాలు గణనీయం గా తగ్గుముఖం పట్టాయని ఎస్పీ అభినందించారు.డ్రైవర్లు తమ విధులకు కనీసం అరగంట ముందుగా హాజరవ్వడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. డ్రైవర్లు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చగలరు అని,విధి నిర్వహణ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మరియు ప్రమాద రహితంగా వాహనాలను నడిపిన పలువురు ఆర్టీసీ డ్రైవర్ల ను జిల్లా ఎస్పీ శాలువాతో సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్. కె శబ్నం, డిపో మేనేజర్ వాణి , డి.టి. సి శేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  జగదీష్  మరియు సురేష్  రవాణా శాఖ  అధికారులు మరియు ఆర్టీసీ సిబ్బంది  పాల్గొన్నారు.

About Author