నీటి సమస్య పరిష్కారానికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్‌డీపీఐ కార్యకర్తలు, కాలనీవాసులు
1 min read

హోళగుంద 7వ వార్డులో కొత్త సబ్మెర్సిబుల్ మోటర్ ఏర్పాటు
సర్పంచ్, కార్యదర్శి, వార్డ్ మెంబర్‌కు ఘన సన్మానం
హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద గ్రామంలోని 7వ వార్డు, సినిమా థియేటర్ వెనుక ఉన్న కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను గ్రామ పంచాయతీ అధికారులు పరిష్కరించడంతో ఎస్‌డీపీఐ కార్యకర్తలు మరియు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.గత 29-03-2026 తేదీన గ్రామ పంచాయతీ తరఫున కొత్త సబ్మెర్సిబుల్ మోటర్ ఏర్పాటు చేసి, కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పూర్తిగా పరిష్కరించారు. ఈ సమస్యపై ఎస్‌డీపీఐ కార్యకర్తలు మరియు కాలనీవాసులు ఎన్నోసార్లు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.ఈ సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ చలవాది రంగమ్మ తనయుడు పంపాపతి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, వార్డ్ మెంబర్ రవిలకు కాలనీవాసులు మరియు ఎస్‌డీపీఐ కార్యకర్తలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా కాలనీవాసులు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్‌ను పూలమాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా భూతి ఇంచార్జ్ జావిద్ భాష, వార్డ్ మెంబర్ రవి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, ఎస్‌డీపీఐ కార్యకర్తలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.కాలనీలో నీటి సమస్య పరిష్కారమవడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.


