శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దంపతులు
1 min read

సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారిని ఆర్. వి.చందన
ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామము నందు వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు “హనుమద్ హోమం” ఆలయ అర్చకులు, వేద పండితులు ఆద్వర్యములో జరిగినది. సోమవారం శ్రీ స్వామి వారి దర్శనార్దం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ కుటుంభ సామెతముగా విచ్చేసి శ్రీ స్వామి వారి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం వీరిని ఆలయ పర్యవేక్షకులు కూరగంటి రంగారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ స్వామి వారి శేషవస్త్రములతో సత్కరించి తీర్దప్రసాదములు అందజేసినారని ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేసినారు.

