ప్యాపిలి మండల బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా శివ కేశవ్ నియామకం
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలానికి చెందిన యువ నాయకుడు శివ కేశవ్ ను బీజేపీ యువమోర్చా ప్యాపిలి మండల అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు, నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు , యువమోర్చా జిల్లా అధ్యక్షులు శిలివేరి వెంకటేష్, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సొప్పాకుల విజయభాస్కర్, ప్యాపిలి మండల అధ్యక్షులు కే. బి. దామోదర్ నాయుడు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కేసి మద్దిలేటి సూచనల మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శివ కేశవ్ మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా తన వంతు బాధ్యతను నిబద్ధతతో మరియు యువతను బలోపేతం చేస్తూ పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కూడా ఆయన పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శివ కేశవ్ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

