NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు ఇబ్బందులు లేకుండా సోలార్ పనులు

1 min read

నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య..

మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్​ నేడు    : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సోలార్ పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య రైతులకు హామీ ఇచ్చారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో గ్రీన్ కో సోలార్ పనులను ఎమ్మెల్యే శనివారం ఉదయం పరిశీలించారు.పనులను పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యే రైతులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మేము పండిస్తున్న పంట పొలాల్లోకి సోలార్ వాళ్ళు కంచెలు వేస్తున్నారని పొలాలకు వెళ్లేందుకు దారి వదలడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.12 నుండి 15 అడుగుల దాకా రోడ్లకు వదులుతారని నాలుగు మీటర్ల రోడ్డు వదిలి సోలార్ పనులు చేపట్టాలని గట్టు పైనున్న నీళ్లు పొలాల్లోకి రాకుండా నీళ్లు వెళ్లేందుకు డ్రైనేజీ ఏర్పాటు చేస్తారని రైతులు ఎవ్వరూ అధైర్య పడొద్దని ఎమ్మెల్యే అన్నారు.అదేవిధంగా సుంకులమ్మ గుడి కాంపౌండ్ నిర్మాణాన్ని సోలార్ వారే నిర్మిస్తారని అన్నారు.సోలార్ మాకూ సహకరిస్తే మేమూ సహకరిస్తామని రైతులు అన్నారు.ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వెంకటయ్య,డీలర్ వెంకటేశ్వర్లు,శివ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు మాండ్ర సురేంద్ర నాద్ రెడ్డి,కాత రమేష్ రెడ్డి, ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం,ఏఓ పీరు నాయక్,ఎస్సై ఓబులేష్, సోలార్ ప్రతినిధులు గణేష్, కమతం వీరారెడ్డి,ఇద్రి స్,సుధాకర్ యాదవ్,బిజెపి మానపాటి శ్రీనివాస గౌడ, వెంకటేశ్వర్లు,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author