NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కు ప్రత్యేక కృషి

1 min read

బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి పి. విజయ

ఎమ్మిగనూరు, న్యూస్ ​నేడు  : జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి పి. విజయ పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాల్య వివాహ ముక్త భారత్ నవంబర్ 27 నుండి మార్చి 8వ తేదీ వరకు నిర్వర్తిస్తున్న వంద రోజుల ప్రణాళికలో  లో భాగంగా డివిజన్ స్థాయిలో శుక్రవారం  ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలోని  రైతు భరోసా కేంద్రం లో  ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలనపై రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థాయిలో బాలబాలికల తల్లిదండ్రులు  చదివించుకోలేని స్థితిలో  ఉన్న బాలలకు    విద్యా, వసతి,  పునరావాసము కల్పించడానికి జిల్లా స్థాయిలో రెండు బాలసదనాలు ఉన్నాయని,  ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.   ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులుఎమ్మార్వో ఎంపీడీవో, సిడిపిఓ నర్సరీ నిస్సా బేగం, డి సి పి యు శారద వైఎస్సి సిఏ మేరి స్వర్ణలత మరియు సూపర్వైజర్లు సురేఖ, గురు శేఖరమ్మ, భాగ్యలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author