ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రూ.999/- కే ప్రత్యేక గుండె చెకప్
1 min read

కర్నూల్, న్యూస్ నేడు : ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం రూ.999/- కే ప్రత్యేక గుండె చెక్‌ప్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.ఈ కార్యక్రమాన్ని మెడికోవర్ హాస్పిటల్ హెడ్ డా.వై. మహేశ్వర్ రెడ్డిమరియు ప్రముఖంగా శ్రీ విక్రాంత్ పటేల్ , తన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్రాంత్ పటేల్ మాట్లాడుతూ “ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత సమస్యలు వృద్ధుల్లోనే కాకుండా యువతలో కూడా వేగంగా పెరుగుతున్నాయి. తప్పు జీవనశైలి, ఒత్తిడి, శారీరక వ్యాయామం లోపం, అలవాటైన జంక్ ఫుడ్ వాడకం కారణంగా గుండె జబ్బులు అధికమవుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా హెల్త్ చెక్‌ప్స్ చేయించుకోవాలి. తొందరగా గుర్తిస్తే గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు” అని తెలిపారు.మెడికవర్ హాస్పిటల్స్ హెడ్ డా.వై. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ “ఈ ప్రత్యేక ప్యాకేజీలో గుండె సంబంధిత ప్రాథమిక పరీక్షలతో పాటు ఇతర ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు ఉంటాయి. లక్ష్యం కర్నూల్ ప్రజల్లో గుండె ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, అలాగే అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ఖర్చుతో సేవలు అందించడం” అని చెప్పారు.ఈ ప్యాకేజీలో ECG, 2D Echo, TMT (if advised), Lipid Profile, Creatinine, RBS (Random Blood Sugar), మరియు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంటాయి.

