కార్మికులకి శ్రావణ మాస మహాలక్ష్మి స్పెషల్ ఆధ్యాత్మిక యాత్ర ఏర్పాటు
1 min read

శ్రావణమాసం అమ్మవారి దేవాలయాలు సందర్శించడంలో భాగంగా ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సులు
జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిని ఎస్.కె షబ్నం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టెంపుల్ టూరిజం లో భాగంగా శ్రావణమాసం అమ్మవారి దేవాలయాలు దర్శించడంలో భాగంగా ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతోంది.ఈరోజు ఏలూరు డిపో నుండి శ్రావణమాసం స్పెష ల్ 3 సూపర్ లగ్జరీ బస్సులలో ఏలూరులోని అంబికా దర్బార్ బత్తి సంస్థ కార్మికులు ఈ యాత్రకు బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా ఏలూరు ప్రజా రవాణా శాఖ అధికారిణి ఎస్.కె.షబ్నం మాట్లాడుతూ టెంపుల్ టూరిజం లో భాగంగా ప్రజలకి ఆయా మాసాల విశిష్టతను బట్టి బస్సులు నడుపుతున్నామని దీనిని చాలామంది ఆదరిస్తున్నారని అందులో భాగంగా అంబికా సంస్థ వారు ముందుకొచ్చి వారి కార్మికులకి శ్రావణ మాస మహాలక్ష్మి స్పెషల్ ఆధ్యాత్మిక యాత్రని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని 17వ తేదీ కూడా ఆఖరి శ్రావణ ఆదివారం కాబట్టి ఇంకా ఎవరైనా ముందుకు వస్తే వారికి కూడా బస్సు ఏర్పాటు చేస్తామని రేపటి నుంచి రిజర్వేషన్ సౌకర్యం కూడా ఆన్లైన్లో ఉంచబడుతుందని, శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకి బస్సులు బుక్ చేసుకునే గురు స్వాములు ఇప్పటినుంచే బుక్ చేసుకోవచ్చని గురుస్వాములకి అనుగుణంగా యాత్ర చేపడుతుందని దానికి సంబంధించి ఈ క్రింది ఫోన్ నెంబర్లు 9346767670, 63038 59484 సంప్రదించవచ్చని తెలియజేశారు.

