NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక నిఘా…కర్నూలు  ఎస్పీ

1 min read

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు  ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదేశాల మేరకు  శనివారం  రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద పోలీసు అధికారులు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పోలీసు సిబ్బందితో కలిసి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.అలాగే ముఖ్య ప్రాంతాల్లో నిఘా పెంచారు .బాంబు స్క్వాడ్ బృందాలు, పోలీసు జాగిలాలతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.పండుగ వేళ ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు .ప్రజల రాక, పోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

About Author