NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శివనామ స్మరనతో మార్మోగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు:  మహాశివరాత్రి పర్వదిన పండుగ సందర్భంగా ఆదివారం శివనామ స్వరంతో శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవాలయం మారు మోగింది. మహా శివరాత్రి పండుగ రోజున నీలకంఠేశ్వర స్వామికిహిమాలయ పర్వతాల నుండి మనస సరొహరం  జలాలు తెచి శ్రీ నీలకంఠశ్వర స్వామి లింగానికి అభిషేకం భక్తులైన దంపతులు చేశారు.మనస సరొహరం  జలాలు  రావడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నారు. కుర్ని నేసే సంఘం ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకానికి తెల్లవారుజాము నుండి 11 గంటల వరకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఉచితంగా  పంచామృతాలు అందజేసి,స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అలాగే శివరాత్రి రోజున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం కన్నులు విందుగా చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ప్యాపిలి సబ్ ఇన్స్పెక్టర్ పి. నాగార్జున దంపతులు శివపార్వతుల కళ్యాణి చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం శివపార్వతులను గ్రామోత్సవం నిర్వహించి పట్టణంలోని వీధిలో గూండ భక్తిశ్రద్ధలతో గ్రామ ఉత్సవం చేపట్టారు. వీటికి భక్తులు మొక్కులు  తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శివరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

About Author