ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
1 min read

ఆలూరు న్యూస్ నేడు : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆస్పరి మండలం ఆస్పరి గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా, విజయవంతంగా ముగిశాయి. క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించేలా నిర్వహించిన ఈ పోటీలకు గ్రామ ప్రజలు, యువత, క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.కబడ్డీ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులను ఘనంగా ప్రదానం చేయడం జరిగింది.మొదటి బహుమతి ₹30,016లను ఆస్పరి గ్రామ సర్పంచ్ మూలింటి రాధమ్మ మరియు కేడీసీసీ మాజీ డైరెక్టర్ రాఘవేంద్ర చేతుల మీదుగా అందజేశారు.రెండవ బహుమతి ₹20,016లను ఆర్‌ఆర్ ఫార్మసీ మిథిలా రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.మూడో బహుమతి ₹10,016లను మేకల రంగనాథ చేతుల మీదుగా అందజేశారు.నాలుగో బహుమతి ₹3,016లను ఆస్పరి యూత్ సేవాసమితి అందజేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆస్పరి సీఐ గంగాధర్ హాజరై క్రీడాకారులను అభినందించారు. కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ, అరవిందు, నరసింహ, సంజన, రాజు, లింగమయ్య, రాఖి, మహేష్, ఖాదర్, పరిసప్ప, ఉరుకుందు, మహానంది, గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొని కబడ్డీ పోటీలను విజయవంతం చేశారు.


