NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రజకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

1 min read

హోలగుంద న్యూస్ నేడు: హోళ గుంద మండలలంలో తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఈనెల 18 తారీకు  జరిగిన సంఘటనకు నిరసనగా రజక సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించిన నిరసన ర్యాలీని వాల్మీకి సర్కిల్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు వ్యాలీగా వెళుతూ తాసిల్దార్ నిజాముద్దీన్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం మద్దతుగా టిడిపి సీనియర్ మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహేట శేషగిరి రజక సంఘం నాయకులు ఉరుకుంద నాగరాజు టిడిపి కన్వీనర్ తిప్పయ్య వైఎస్ఆర్సిపి వైసిపి కన్వీనర్ సఫివుల్లా ఎస్ డి పి నాయకులు హమీద్ బహుజన టైమ్స్ ఎండి దుర్గాప్రసాద్ ఎమ్మార్పీఎస్ నాయకులు వెంకటేష్ టిడిపి నాయకులు దుర్గయ్య తోక వెంకటేష్ మాట్లాడుతూ కుమ్మెర పసికందు చనిపోయి నేటికీ 10 రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ప్రకటన రాకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి .   తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత అమానుషమైన దాడి జరగడం సిగ్గు చేటు అని వారన్నారు ,ప్రజాసంక్షేమ ప్రభుత్వం అని ముఖ్యమంత్రివర్యులు ప్రకటించారు కానీ ప్రజాసంక్షేమ ప్రభుత్వంలో రజక దళిత సామాజిక వర్గానికి చెందిన రెండు నెలల పసికందును కాలుతో పుట్ బాల్ లా తన్ని చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని 3 గంటల పాటు చిత్రహింసలకు గురిచేస్తూ బూతులు మాట్లాడిన ఎనిమిది మంది రెడ్లపై హత్యకేసు పెట్టకుండా డిఎస్పీ సీఐ ఎస్సైలు కుమ్ముకై బాధితులపై రివర్స్ కేసు పెట్టడం , బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ను తీసుకోకపోవడం ఎంత దుర్మార్గమైన చర్య , వ్యవస్థలు ఎవరికోసం పనిచేస్తున్నాయో ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా గమనించాలి, రానున్న రోజుల్లో మన ఓటు మనం వేసుకుని బీసీ రాజ్యాధికారం కోసం పాటుపడాలి అప్పుడే మనపై దాడి చేయాలన్న మన జోలికి రావాలన్నా అగ్రకులాలు భయపడతాయని వారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.     ఈ కార్యక్రమంలో రజక సంఘానికి మద్దతుగా  టీడీపీ ,వైసీపీ ,ఎస్డిపిఐ, సిపిఐ,యసి ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం రవికాంత్ రంగన్న, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా  రాష్ట్ర కార్యదర్శి సుబాన్, ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు ఎఫ్, అబ్దుల్ హమీద్, ఉపాధ్యక్షులు కే ,సలాం,నాగరాజు హనుమంతు  రజకులు కరెంటు మల్లికార్జున.క్లబ్ ఈరన్న.ఏరురు రమేష్.పెద్ద ఈరన్న lic లక్ష్మణ మలికార్జున  హనుమేష్ నాగేంద్ర శ్రీను  నాయకులు తదిత​రులు పాల్గొన్నారు.

About Author