NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుడ్షెప్పర్డ్ పాఠశాల లో ఘనంగా సైన్స్, ఇంగ్లీష్ ఎక్సపో

1 min read

ముఖ్య అతిథి గా మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జీ. వెంకటేష్………

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు నగరం లోని .స్థానిక విఠల్ నగర్ లో ని గుడ్ షేప్పర్డ్ పాఠశాల మైదానం లో సోమవారం సైన్స్ మరియు ఇంగ్లీష్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జీ. వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మొదట రాజ్యసభ సభ్యులు టీ.జీ.వెంకటేష్  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాజీ రాజ్యసభ సభ్యులు టి. జి. వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనూ మరియు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అలాగే మీ ఇంట్లో మీ నాన్నగారు మద్యపానం మరియు ధూమపానం అలవాటు ఉంటే మీరు తప్పకుండ మాన్పించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ మిన్నల్ల మాట్లాడుతూ సైన్స్ మరియు ఇంగ్లీష్ ఎక్స్పో వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ను వెలికి తీసేందుకు ఎంతో దోహద పడుతుందని పేర్కొన్నారు. తనంతరం విద్యార్థులు తయారుచేసి ప్రదర్శించిన 162 నమూనాలను రాజ్యసభ సభ్యులు సందర్శించారు. నమూనాలను వివరించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం టీజీ వెంకటేష్ గారిని పాఠశాల కరస్పాండెంటు మిన్నల్ల శాలువా,గజమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, సురేంద్ర, ప్రవీణ్ పాఠశాల ప్రిన్సిపాల్ మెహరున్నిసా ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author