NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

1 min read

పత్తికొండ సిఐ జయన్న సూచన                                       

పత్తికొండ, న్యూస్ నేడు:  విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పత్తికొండ సిఐ జయన్న సూచించారు. పత్తికొండ మండలం దేవనబండ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు కెపిఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో  పదవ తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ  రైటింగ్ ప్యాడ్స్, పెన్ను ,  జామెంట్రీ బాక్సులను పత్తికొండ సిఐ  జయన్న విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైత్రి వ్యవస్థాపకులు మరియు బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు,డా,, ఎస్ రామ్మోహన్ , విద్యార్థులను ఉద్దేశించి మరి బాగా చదువుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని,  ఉన్న ఊరికి ,పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని, నేటి యువతీ రేపటి భవిత అంటూ విద్యార్థులకు ప్రేరణ కల్పించారు కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాకీర్ హుస్సేన్, పాఠశాల ఉపాధ్యాయ బృందము పాల్గొన్నారు.

About Author