విజయవంతమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఉత్సవం
1 min read

హోళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండలం జనసంద్రం! మన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు హోళగుంద మండల కేంద్రంలో అత్యంత వైభవంగా, ఒక పండుగలా జరిగింది.ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నియోజకవర్గ ఇంచార్జి వైకుంఠం జ్యోతి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. “ప్రజల సంక్షేమమే ధ్యేయంగా.. పెంచిన పెన్షన్లతో ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపడమే మన లక్ష్యం” అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. తరలివచ్చిన లబ్ధిదారులు మరియు ప్రజలు.వృద్ధులు, వికలాంగుల పట్ల జ్యోతి ఆత్మీయ పలకరింపు.పండుగ వాతావరణంలో సాగిన పెన్షన్ల పంపిణీ. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయవంతం చేసిన మండల పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు హోళగుంద మండల ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల కన్వీనర్ తిప్పయ్య, తెలుగుదేశం సీనియర్ నాయకులు గోవింద్ గౌడ్, దుర్గయ్య, తోక వెంకటేష్, కర్నూలు జిల్లా పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సుభాన్, తెలుగుదేశం మండల అధ్యక్షులు సిబిఎన్ ఆర్మీ ముల్ల మోయిన్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


