NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం సోదరి సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన  బుట్టా శివ నీలకంఠ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: రంజాన్ పర్వదిన సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలోని ఆల్ హదీస్ ఈద్గా మరియు కమిటీ రోడ్‌లో ఉన్న ఈద్గా వద్ద పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ . శ్రీ బుట్టా శివ నీలకంఠ   మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ అత్యంత పవిత్రమైన మాసమని, ఈ నెలలో ఉపవాస దీక్షలు పాటిస్తూ శాంతి, సహనం, సేవా భావాన్ని ప్రపంచానికి తెలియజేస్తారని తెలిపారు.మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలనే సందేశాన్ని రంజాన్ పండుగ అందిస్తుందని అన్నారు.ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు సుఖసంతోషాలతో ఉండాలని, వారి కుటుంబాలలో శాంతి, ఐశ్వర్యాలు నెలకొనాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం యూత్ అధ్యక్షులు నజీర్ అహ్మద్,కర్నూలు జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు మహబూబ్ బేగ్, సోషల్ మీడియా కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ సయ్యద్ చాందు బాషా, పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమ్ము రాజశేఖర్, పాల శ్రీనివాసరెడ్డి, జిల్లా చేనేత అధ్యక్షులు శివ ప్రసాద్, జిల్లా చేనేత హస్తకళల అధ్యక్షులు చేనేత మల్లి, జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీ మధుబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి గొరవ మహబూబ్ బాషా, పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డం అంజి,15 వ వార్డ్ ఇంచార్జ్ ఫయాజ్, పట్టణ కార్యదర్శి కర్రే రాముడు, పట్టణ జనరల్ సెక్రెటరీ జేరుబండి రఘువీర్,మండలం సెక్రటరీ తిమ్మాపురం బజారి, తిమ్మాపురం వీరాంజి, ముస్లిం సోదరులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

About Author