NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం మనోభావాలు సుప్రీం కోర్టు పరిగణనలోకి  తీసుకోవాలి

1 min read

“ముస్లీం పర్సనల్ లా బోర్డు”, రాష్ట్ర కన్వీనర్ రఫీఖ్

నంద్యాల ముస్లిం జేఎసి ఆధ్వర్యంలో “వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం?” పుస్తకావిష్కరణ

న్యూస్ నేడు నంద్యాల ప్రతినిధి: నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ  ఆధ్వర్యంలో అంటి కోట మస్జిద్ ప్రాంగణంలో  జనాబ్ ముహమ్మద్ రఫీఖ్, కన్వీనర్, వక్ఫ్ రక్షణ – రాజ్యాంగ రక్షణ క్యాంపెయిన్, “ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు”, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య అతిథిగా హజరై “వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం?” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ముస్లిం జేఏసీ గౌరవాధ్యక్షులు అబ్దుల్ సమద్  అధ్యక్షత వహించారు. మొహమ్మద్  రఫీక్ ని, జేఏసీ తరపున  కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ,  గౌరవ అధ్యక్షులు ఎస్. ఎం డి అబులైస్, ఆల్ మేవా రాష్ట్ర అధ్యక్షులు ఇమ్రాన్ పాషా, కో- కన్వీనర్ మస్తాన్, కోశాధికారి ఎస్పీ బాష, ఆయిట జిల్లా అధ్యక్షులు షోయబుజ్జమన్ లు శాలువతో ఘనంగా సత్కరించారు.  ఈ సంధర్భంగా  రఫీక్  మాట్లాడుతూ, నేడు మతతత్వ వాదులు వక్ఫ్ చట్టం గురించి జన బాహుళ్యం లో ముస్లింలలోనూ, ముస్లిమేతరులలోను,   తీవ్ర అపోహలు, అనుమానాలు కలిగేలా ప్రచారం చేశారని, వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని,  ఈ అపోహలను పటాపంచలు చేయడానికి ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతుందని, కాబట్టి అపోహలు ఉన్నవారు ఈ పుస్తకాన్ని తప్పక చదివి అపోహలను దూరం చేసుకోవాలని కోరారు. రఫిక్  మాట్లాడుతూ సుప్రీంకోర్టులో అనేక సంస్థలు వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేయడం జరిగిందని, కాబట్టి, సుప్రీంకోర్టు 40 కోట్ల మంది ముస్లింల మనోభావాలను పరిగణలోకి తీసుకుని బాబ్రీ మసీదు విషయంలో ఎలా అయితే హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని తీర్పు ఇచ్చిందో, అలా వక్ఫ్ సవరణ చట్టం విషయంలో తీర్పు ఇవ్వాలని కోరారు. కేంద్రం  వ్యవసాయ చట్టాలను ఏ విధంగా వెనక్కి తీసుకున్నదో అలా వక్ఫ్ సవరణ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తులను కాపాడడం ప్రతి ఒక్క ముస్లిం బాధ్యత అని అన్నారు. జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా  మాట్లాడుతూ, తాము ఇంతవరకు “ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు” ఆదేశాలను శిరసావహిస్తూ ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ఉలమాలు అందరినీ కలుపుకొని, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ మెయిల్ క్యాంపెఇన్, రౌండ్ టేబుల్ సమావేశం, నల్లరిబ్బన్ కట్టుకొని నిరసన వ్యక్తం చేయడం, ర్యాలీ, మానవహారం, స్థానిక ఎంపీ ని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం, లాంటి కార్యక్రమాలను ప్రజల సహకారంతో విజయవంతంగా నిర్వహించామని, తమ నివేదికను సమర్పించారు. అబులైస్  మాట్లాడుతూ “వక్ఫ్ సవరణ చట్టం” ముస్లింల ఆర్థిక మూలాలను మరియు రాజ్యాంగ హక్కులను కాలరాసే కుట్ర అని అన్నారు.ఈ కార్యక్రమంలో జమాత్ ఇస్లామి మోమిన్ గౌస్, ఖిద్మత్ ఫయాజ్, ఆల్ మేవా జిల్లా అధ్యక్షులు సలీం, వెల్ఫేర్ పార్టీ అలీమ్, ఎస్ డి పి ఐ ఎజాజ్  తదితరులు పాల్గొన్నారు.

About Author