ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
1 min read

టిడిపి శ్రేణులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపు
సుపరిపాలనలో తొలి అడుగు సమీక్ష సమావేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం లక్ష్మీపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం లక్ష్మీపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సమీక్ష సమావేశానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. “సుపరిపాలనలో తొలిఅడుగు” కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.47,456 కోట్లు కేటాయించిందని, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని ఎంపీ తెలిపారు. మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డ్వాక్రా మహిళలకు రూ.28 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు, 13 నుంచి 11 శాతానికి వడ్డీ తగ్గించి స్త్రీనిధి ద్వారా రూ. 4,500 కోట్లు రుణాలు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ఎంపీ స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రూ.9.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి దెందులూరు నియోజకవర్గం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఎంపీగా చట్టసభలో అడిగిపెట్టిన తరువాత ఇప్పటి వరకు దెందులూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధికి డోకా లేకుండా ఉంటుందని ఎంపీ వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గారపాటి రామసీత, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మహేష్ యాదవ్, నాయకులు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి పాల్గొన్నారు.


