టీడీపీ, జనసేన కలిసి పోరాటం చేస్తాయి !
1 min read

పల్లెవెలుగువెబ్ : పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగేలా ప్రసంగించడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పా? అని ప్రశ్నించారు. మహిళల్ని అగౌరవపరుస్తూ వైసీపీ నేతలు మాట్లాడినప్పుడు సీఎం చర్యలు తీసుకోకపోగా… నవ్వుతూ ఎంజాయ్ చేశారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన కలిసి ప్రజా సమస్యలపై పోరాడతాయని పేర్కొన్నారు.

