కలెక్టర్ కార్యాలయంలో జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశం
1 min read

సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీ, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్
జిల్లా వైద్య శాఖ అధికారులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య సిబ్బంది
ఏలూరు, న్యూస్ నేడు: ఏలూరు సర్వజన ఆసుపత్రికి నిత్యం ఎంతోమంది పేదవర్గాలు వైద్య సహాయం కోసం వస్తున్నారు – అటువంటి వారికి సమగ్రంగా వైద్య సహాయాన్ని అందించి వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత మన కూటమి ప్రభుత్వంపై ఉంది. పేదలకు అందించాల్సిన వైద్య సేవల అంశంలో ఎలాంటి అలసత్వం లేకుండా చర్యలు చేపట్టాలి . వైద్య సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది వంటి పెండింగ్ ఉన్న నియామకం పట్ల ఉన్న సాంకేతిక సమస్యలను సత్వరమే అధిగమించాలి,అవసరమైతే రాష్ట్ర ఉన్నత స్థాయి వైద్య శాఖ అధికారులతో సంప్రదించి ఏలూరు సర్వజన ఆసుపత్రికి ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేలా జిల్లా వైద్యశాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపండి అన్నారు. అవసరమైతే ఇతర హాస్పిటల్స్ నుంచి కూడా వచ్చి ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించేలా స్పెషలిస్ట్ డాక్టర్ లతో, ఆయా సంస్థల ఛైర్మన్లతో సంప్రదింపులు జరపండన్నరు.ప్రతి పేదవాడి ఆరోగ్యానికి, ప్రాణానికి మన కూటమి ప్రభుత్వం అండగా ఉంది అనే భరోసా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత మన అందరిపైఉందన్నారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ఏలూరు సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో వైద్యశాఖ అధికారులకు పలు సూచనలు సలహాలు సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అందించారు.

