NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం

1 min read

ఆలూరు , న్యూస్ నేడు :  ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం సాయంత్రం 3 గంటలకు  ఆలూరు ఎల్లార్తి రోడ్డు ఇబ్రహీం ఫంక్షన్ హాల్ నందు  తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి  అధ్యక్షతన నిర్వహించబడుతుంది. ఈ సమావేశమునకు తెలుగుదేశం పార్టీ జోన్ 5 ఇంచార్జ్ బీద రవిచంద్ర యాదవ్  కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  శ్రీ పాలకుర్తి తిక్కా రెడ్డి  హాజరుకానున్నారు మీరు ఈ సమావేశమునకు తప్పక హాజరు కాగలరని  కోరుచున్నాను.ఆలూరు నియోజకవర్గ ఆరు మండలాల  కన్వీనర్లు టిడిపి  సీనియర్ నాయకులు కార్యకర్తలు,క్లస్టర్ యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి,సర్పంచ్,మాజీ సర్పంచ్,ఎంపిటిసి, మాజీ ఎంపిటిసి, ఎంపీపీ,మాజీ ఎంపీపీ,టీడీపీ యూత్  లీడర్ లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు తెలుగుయువత, ఐటిడిపి, టియన్ఎస్​ఎఫ్​, టియన్​టియుసి, సిబిఎన్​ ఆర్మీ, టిడిపి,   సోషల్ మీడియా ప్రతినిధులుమరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ,వైకుంఠం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

About Author