NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి సవితమ్మను కలిసిన  జిల్లా కురువ సంఘం నాయకులు           

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మంత్రి సవితమ్మను మంగళవారం ఉదయం కర్నూలులో జిల్లాకురువ సంఘము నాయకులు కలిసి శాలువాతో సత్కరించి బోకే అందజేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిఎం. కె. రంగస్వామి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, బి.వేంకటేశ్వర్లునగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు జిల్లా కోశాధికారి కె. సి. నాగన్న అల్లూరు వేంకటేశ్వర్లు, ఓ.పుల్లన్న  తదితరులు ఉన్నారు. వారు మంత్రితో మాట్లాడుతూ గోర్రేలు మేకలకు ఉచిత ఇన్సూరెన్స్,90 శాతం సబ్సిడీపై గొర్రెల మేకల కొనుగోలు కు ఇవ్వాలని రాష్ట్రంలోనే ప్రధాన దేవాలయాలైన తిరుపతి, అహోబిలం,విజయవాడ తదితర పట్టణాల్లో కనకదాసు భవనాలు నిర్మించాలని కోరారు. పై విషయంను సిఎం చంద్రబాబు నాయుడు  దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలోకె. మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author