రైతును రారాజు చేయడమే కూటమి ధ్యేయం
1 min read

మాసపేట’లో’రైతన్నా-మీకోసం’కరపత్రాల పంపిణీ
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు :రైతులను రారాజు చేయడమే కూటమి ప్రభుత్వ ద్యేయమని నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి, మిడుతూరు టీడీపీ మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసపేట, ఉప్పలదడియ గ్రామాల్లో శుక్రవారం గ్రామ నాయకులు కమతం రాజశేఖర్ రెడ్డి,వీరారెడ్డి ఆధ్వర్యంలో ‘రైతన్నా మీకోసం’అనే కార్యక్రమం జరిగింది. అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లో రెండవ విడత జమ కావడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజల అభివృద్ధి,నిరంతరం ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తుందని కమతం రాజశేఖర్ రెడ్డి అన్నారు.రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని అన్నారు.ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,ఎంఏఓ పీరు నాయక్ లబ్ధి పొందిన వారి ఇండ్లకు వెళ్లి ప్రభుత్వ కరపత్రాలను అందజేశారు. ప్రతి రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రంలో ఏపీఏఐఎంఎస్ లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ అశోక్,మల్లికార్జున రెడ్డి,విఏఏ మహేష్ మరియు రైతులు పాల్గొన్నారు.

