NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రీస్తు జననం ప్రపంచ మానవాళికి శుభదినం

1 min read

మాజీ ఇడా చైర్మన్ బోద్దాని శ్రీనివాస్

క్రిస్మస్, న్యూ ఇయర్,సంక్రాంతి పండుగలను మరింత ఆనందంగా జరుపుకోవాలి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రపంచ మానవాళికి సేవ శాంతి, దయ కరుణ, ప్రేమ బోధించిన మహనీయులు యేసు క్రీస్తు అని. పొరుగు వారిని ప్రేమించు అన్న  ఆయన బోధనల ద్వారా ఎంతోమంది శాంతి మార్గాన్ని నడుస్తున్నారని   మాజీ ఇడా ఛైర్మన్ బోద్దాని శ్రీనివాస్ అన్నారు. ఆయన మన పాప విముక్తి కొరకు సిలువలో   వేలాడి  పాపుల కొరకు చిందించిన రక్తం ద్వారానే మనమంతా పాప విముక్తులయ్యామని అభిప్రాయపడ్డారు. క్రీస్తు జననం యావత్ మానవాళికి శుభదినంగా  ప్రపంచమంతా పెద్ద ఎత్తున పండుగ వేడుకలను జరుపుకోవాడం ఆనందంగా సంతోషం ఉందన్నారు. కుల మతాలకతీతంగా కూటమి ప్రభుత్వ పాలనలో  ప్రతి కుటుంబంలో రాబోయే 2026 సంవత్సర కాలం అంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో  కుటుంబ సభ్యులందరూ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలను కుడా మరింత ఉత్సాహంగా ఆనందంగా జరుపుకోవాలని బోద్దాని  ఆకాంక్షించారు.

About Author