NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా విజిలెన్స్ అధికారిగా జిఎన్ఎస్ రెడ్డి

1 min read

కలెక్టర్..జేసీని కలిసిన డివివో..

కర్నూలు న్యూస్ నేడు:  కర్నూలు జిల్లా విజిలెన్స్, డ్వామా ఉపాధి హామీ పథకం (విబిజిఆర్ఏఎం జి) అధికారిగా జిఎన్ఎస్ రెడ్డి (నాగ శేషాచల రెడ్డి )బాధ్యతలు స్వీకరించారు.అనంతపురం జిల్లా గుంతకల్ డివిజనల్ డెవలప్ మెంట్ అధికారిగా పనిచేస్తున్న జిఎన్ఎస్ రెడ్డిని డివివోగా నియమించారు. సోమవారం కర్నూలులో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మరియు జాయింట్ కలెక్టర్ నూరు ఖమర్ లను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిఎన్ఎస్ రెడ్డి ని కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈయన ఉమ్మడి కర్నూలు జిల్లాలో మిడుతూరు, నందికొట్కూరు,కల్లూరు మండలాల్లో ఎంపీడీవో గా పని చేశారు.ఈ సంవత్సరం జూలైలో కల్లూరు ఎంపీడీవో గా పని చేస్తూ గుంతకల్ కు పదోన్నతిపై వెళ్లారు.అక్కడి నుండి బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *