NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అవార్డు అందుకున్న ఓర్వకల్లు ఎంపీడీఓ,ఎస్ఐ,డీటీ..

1 min read

ఓర్వకల్లు , న్యూస్​ నేడు : కర్నూలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం జరిగిన79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎంపీడీవో ఎం శ్రీనివాసులు మరియు ఓర్వకల్లు ఎస్సై యు.సునీల్ కుమార్ ఉత్తమ అధికారులుగా అవార్డు అందుకున్నారు.రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ మరియు కర్నూలు కలెక్టర్ పి రంజిత్ భాష,కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎంపీడీవో ఎస్సై లకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.తర్వాత ఓర్వకల్లు తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసిల్దార్ ఎం. సతీష్ కుమార్,అదేవిధంగా ఓర్వకల్లు మండలంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు బషిరున్ భీ,ఎల్ సురేష్ కుమార్ మంత్రి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు.

About Author