NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లు అందజేత

1 min read

దెందులూరు నియోజకవర్గంలో గ్రామగ్రామాన  పండగల సాగిన ఫించనుల పంపిణీ కార్యక్రమం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు నియోజకవర్గం అనేక గ్రామాల లో చేపట్టి పెన్షన్ లబ్ధిదారులకు పింఛన్లు, పలువురు అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఆఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పంపిణీ చేశారు. పెదవేగి మండలంలోని మొండూరు, వేగివాడ, చక్రాయగూడం, దెందులూరు మండల పరిధిలోని సీతంపేట, ముప్పవరం, మేదినరావు పాలెం, రామారావు గూడెం సహా అనేక గ్రామాల్లో శనివారం ఉదయం సుడిగాలి పర్యటన చేపట్టి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన లబ్ధిదారుల ముఖాలలో చిరునవ్వును చవిచూశారు.సామాజిక పింఛన్లను ఎన్నికల సమయంలో రూ.2000 నుంచి 3000 చేస్తానని చెప్పిన జగన్ ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి పెంచుకుంటా పోతా  అంటూ చేయి ఎంతో బాగా సాగదీశారని, దీనివల్ల నమ్మి ఓట్లేసినందుకు ఎంతోమంది వృద్ధులు దివ్యాంగులు తీవ్ర మనోవేదనకు గురైయ్యారని అన్నారు. అయితే రూ.1000 రూపాయలు ఫించను పెంచడానికి వైసిపి పాలనలో జగన్కు  ఐదు సంవత్సరాల కాలం పడితే రూ.3000 రూపాయల ఫించను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఒక్క దఫాలో రూ.1000 పెంచి రూ.4000 ఇవ్వడమే కాకుండా ఎన్నికల హామీలో ఇచ్చిన గత మూడు నెలల పెంచిన పింఛన్లు కూడా అమలు చేస్తూ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పాత బకాయిలతో సహా లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను అందించి ఫించన్ అంటే పండగల కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు.మార్చి 1వ తేదీ ఆదివారం రావడంతో, అధికారులకు సిబ్బందికి సెలవు రోజు కావడంతో ప్రతి నెల వచ్చే సామాజిక పింఛన్ల కోసం ఎదురుచూసే లబ్ధిదారుల అభిప్రాయాలను కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ అమలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author