NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలి

1 min read

పి పి పి విధానాన్ని రద్దు చేయాలి

ప్రభుత్వ  మెడికల్ వైద్య కళాశాలను ప్రైవేటుకరణ ఆపాల

పిడిఎస్ఓ, డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల డిమాండ్.

ఎమ్మిగనూరు న్యూస్ నేడు :  ఎమ్మిగనూరు పట్టణంలో ముఖ్యంగా ఉద్దేశించి పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ డి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ వైద్య కళాశాలలను ప్రజలకు సరైన వైద్యం విద్యార్థులకు సరైన విద్య అందుతుందనే ఉద్దేశంతో గత వైఎస్ఆర్సిపి అయంలో లో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులుకు, ప్రజలకు అన్యాయం చేస్తూ పి పి పి పద్ధతిలో కొనసాగిస్తామని క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రజలు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 2020 సంవత్సరంలో ఆదోనిలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మించడానికి అప్పటి వైద్య శాఖ మంత్రి అల్లా నాని పలుచోట్ల స్థల పరిశీలన చేసి చివరికి అరెకల్  గ్రామం వద్ద మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు   ఎన్ హెచ్ 167 పక్కన 48.44 ఎకరాల స్థలంలో 475 కోట్ల ప్రతిపాదనతో 40 పడకలతో ఆసుపత్రి, 100 సీట్లతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ మరియు హాస్టల్ కొరకు 2021 లో వర్చువల్ పద్ధతి నిర్వహించడం జరిగింది. దీనిని ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య మెడికల్ కళాశాలను కొనసాగించాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో  పిడిఎస్ఓ ఆదోని డివిజన్ కార్యదర్శి శివ, పట్టణ కార్యదర్శి రాజేష్ ,స్వామి సమర్థ ,డి ఎస్ ఎఫ్ ముఖ్య నాయకులు వినోద్ నరసింహులు ఇస్మాయిల్ రామకృష్ణ  కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author