NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజ‌ల‌కు వివ‌రించాలి

1 min read

ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారానికి అధిక ప్రాధాన్యత‌

క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ కార్యక‌ర్తల స‌మావేశంలో మంత్రి టీజీ భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజ‌ల‌కు అర్థమ‌య్యేలా వివ‌రించాల్సిన బాధ్యత కార్యక‌ర్తలు, నాయ‌కుల‌పై ఉంద‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ కార్యక‌ర్తల స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ముందుగా దివంగ‌త ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ముఖ్య నాయ‌కులు మాట్లాడుతూ వార్డుల్లో జ‌రుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివ‌రించారు. అనంత‌రం మంత్రి టీజీ భ‌ర‌త్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రతి వార్డులో అభివృద్ధి ప‌నులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజా స‌మస్యల ప‌రిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామ‌న్నారు. యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించేందుకు ప‌రిశ్రమ‌లు తీసుకొస్తున్నామ‌న్నారు. ట్రేడ్ లైసెన్స్ విష‌యంలో వ్యాపారుల‌కు ఇబ్బందులు లేకుండా పాత ప‌ద్దతిలోనే రుసుము చెల్లించేలా చ‌ర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప‌రిష్కారానికి నోచుకోని స‌మ‌స్యల‌ను తాను గెలిచిన త‌ర్వాత ప‌రిష్కరించిన‌ట్లు గుర్తు చేశారు. ఓల్డ్ సిటీ వాసుల‌కు ఎంతో ముఖ్యమైన గ‌డియారం ఆస్పత్రిని అన్నివిధాలా అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌న్నారు. కార్యక‌ర్త నుండి పై స్థాయి వ‌ర‌కు ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజ‌ల్లో ఉండాల‌న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ‌న్‌తో రాష్ట్రం ఎంతో అభివృద్ధి అవుతోంద‌న్నారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో తామంతా నిత్యం క‌ష్టప‌డి ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు. రానున్న 6 నెల‌ల్లో స్థానిక సంస్థల ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, నాయ‌కులు సిద్ధం కావాల‌న్నారు. స‌ర్వేలు చేసి అనుకూలంగా ఉన్నవారికే టికెట్ కేటాయించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. పార్టీ సూచ‌న‌ల మేర‌కు ప్రతి కార్యక‌ర్త‌, నాయ‌కుడు పనిచేయాల‌న్నారు. మై టీడీపీ యాప్‌ను త‌ప్పకుండా ఉప‌యోగించాల‌న్నారు. పుర‌మిత్ర యాప్ ద్వారా ప్రజ‌ల స‌మ‌స్యలు ప‌రిష్కరించేందుకు కృషి చేయాల‌న్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువ‌త రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి న‌వీన్, టిడిపి జిల్లా ప్రధాన కార్యద‌ర్శి నాగ‌రాజు యాద‌వ్, బొందిలి కార్పొరేష‌న్ ఛైర్మన్ విక్రమ్ సింగ్, రాష్ట్ర హ‌జ్ క‌మిటీ స‌భ్యులు సూరిమ‌న్సూర్ అలీ ఖాన్, ఏపీఐఐసీ డైరెక్టర్ జ‌గ‌దీష్ గుప్త‌, ఎం.ఎస్.ఎం.ఈ డైరెక్టర్ కౌశిక్, టూరిజం కార్పొరేష‌న్ డైరెక్టర్ ముంతాజ్, సివిల్ స‌ప్లైస్ కార్పొరేష‌న్ డైరెక్టర్ ల‌క్ష్మీనారాయ‌ణ‌, వాల్మికి కార్పొరేష‌న్ డైరెక్టర్ సంజీవ‌ల‌క్ష్మి, రమేష్, టిడిపి న‌గ‌ర అధ్యక్షుడు కొర‌కంచి ర‌వి కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, తెలుగుయువ‌త పార్ల‌మెంట్ అధ్యక్షులు అబ్బాస్, మాజీ కార్పొరేట‌ర్లు, సీనియ‌ర్ నాయ‌కులు, బూత్ ఇంచార్జీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author