NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి విడనాడాలి

1 min read

– రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు

జలదుర్గం గ్రామంలోని 15 కుటుంబాలు సిపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘం,వ్యవసాయ కార్మిక సంఘాలలో చేరిక

ప్యాపిలి, న్యూస్​ నేడు: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలను ఆదుకోవాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై చిన్న చూపుతో నిర్లక్ష్య ధోరణి అవలంబించడం చాలా దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి.రామచంద్రుడు,సీఐటీయు మండల కార్యదర్శి చిన్న రహిమాన్, జిల్లా నాయకులు శివరాం, రామాంజనేయులు, నక్కి శ్రీకాంత్,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు  వారన్నారు. ఈసందర్భంగా సోమవారం జలదుర్గం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు సిపిఎం పార్టీ అనుబంధ ప్రజా సంఘాల్లో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన  బహిరంగ సభకు పద్మశాలి శ్రీనివాసులు అధ్యక్షత జరిగింది. ముందుగా జెండాను సిఐటియు ప్యాపిలి మండల కార్యదర్శి చిన్న రహిమాన్ ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి  ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి.రామచంద్రుడు,సీఐటీయు మండల కార్యదర్శి చిన్న రహిమాన్, జిల్లా నాయకులు శివరాం, రామాంజనేయులు, నక్కి శ్రీకాంత్,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు మాట్లాడుతూ తుఫాను వల్ల నంద్యాల జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట చేతికి వచ్చిన దశలో తీవ్రంగా పంట దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోయారని దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం ప్రకటించడంలో ప్యాపిలి,డోన్ మండలాల్లో ని గ్రామాల్లో అత్యధికంగా నష్టపోయిన పంటలను కూడా పరిగణలోకి తీసుకోవాలని వారు కోరారు.ఆముదం,ఉల్లి,సజ్జలు,కంది పంటలు నష్టపోవడం జరిగిందని పండిన ఉల్లి పంటను అమ్ముకోవడానికి రేట్లు లేవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందడం లేదని రైతాంగం పండించిన ఏ ఒక్క పంట ప్రభుత్వం మద్దతు ధరలకు కొనుగోలు చేయకపోవడం వల్ల మధ్య దళారుల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.అలాగే సకాలం లో ప్రభుత్వాలు రైతులకు అవసరమైననాణ్యమైన విత్తనాలు,ఎరువులు,పంట రుణాలు,మద్దతు ధరలు,పంటల బీమా అందించకపోవడం వల్ల ప్రైవేటు వ్యాపారుల అధిక రేట్ల దోపిడీతో రైతులు నష్టపోతున్నారని కావున రైతులందరూ రాజకీయాలకు అతీతంగా అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పోరాడాలని అన్నారు.జిల్లా అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్యాపిలి మండల గ్రామాల్లో అధిక వర్షాల వల్ల పూత,పిందె రాలిపోయి,చెట్లు చనిపోయి కంది పంట నష్టపోయిన మరియు ఆముదం,ఉల్లి పంట రైతులకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం వెంటనే అందించాలని, అన్ని రకాల పంటలకు ప్రభుత్వ బీమా అమలు చేయాలని,అన్ని రకాల పంటలు రైతుల చేతికి రాకముందే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అమలు జరిపేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎన్. ఆర్.జి.ఎస్ పథకం ద్వారా ఉద్యానవన పంటలు నాటుకున్న వారి బిల్లులు వెంటనే మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తదనంతరం జలదుర్గం గ్రామానికి చెందిన రాసి పోగుల ఓబయ్య,రాసి పోగుల ప్రతాప్,యం.రమేష్, వడ్డే శీను,మహమ్మద్ షఫీ, హుస్సేన్ లతోపాటు 15 మంది చేరడం జరిగింది.ఈ సమావేశంలో ఐద్వా నాయకురాలు షేమిమ్ బేగం, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, మహేంద్ర,కె.వి.పి.యస్ నాయకులు రాజ్ కుమార్ పాల్గొన్నారు.

About Author