పెంచిన గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు గ్యాస్ పూర్తిస్థాయిలో సరఫరా చేయాలి
1 min read

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సిపిఐ వందేళ్ళ వార్షికోత్సవాలను పురస్కరించుకొని గడప గడపకు సిపిఐ కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఆర్.ఆర్.పేట పరిసర ప్రాంతాల్లో పార్టీ ఉద్యమ నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా 100 ఏళ్ల శతాబ్ది వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ 100 ఏళ్ల కాలంలో ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ,కార్మిక,కర్షకుల హక్కుల కోసం అనేక ఉద్యమాలను భారతదేశంలో నడిపిన గొప్ప పోరాట చరిత్ర కమ్యూనిస్టు పార్టీ సొంతమని కొనియాడారు.నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత అనేక హామీలను ప్రజలకు ఇచ్చి వాటి అమలుకు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు.మన దేశ అంతర్గత అంశాలపై అమెరికా చాలా ఇస్తున్న ఆధిపత్యానికి కనీసం సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి వ్యవహరించడం దేశ ప్రజలను మరింత అయోమయానికి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్,ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అవలంబిస్తున్న దుందుడుకు చర్యల వలన మన దేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై నరేంద్ర మోడీ కనీసం నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో మన దేశంలో గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై అధిక భారాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తులు,గ్యాస్ కొరత వలన,అధిక ధరల వలన ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కురెళ్ళ వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు కొల్లూరి సుధారాణి, మావూరి విజయ, కొండేటి రాంబాబు, బళ్ల కనకదుర్గారావు, లక్కోజు జగదీశ్వరి, ఉప్పులూరి లక్ష్మి, భవాని, రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

