NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి

1 min read

మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్

కర్నూలు, న్యూస్​ నేడు : జిల్లాలో ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్ పేర్కొన్నారు.  జిల్లాలో అక్టోబర్ 16 వ తేదీన ప్రధాన మంత్రి  పర్యటిస్తున్న సందర్భంగా ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా సమీపంలో సభా ప్రాంగణంలోని కంట్రోల్ రూమ్ లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో  మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి,  టీజీ భరత్, ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండియన్  సమీక్ష నిర్వహించారు..సమీక్షలో ఐఏఎస్ అధికారులు,రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు ప్రధాని వస్తున్న క్రమంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మన కుటుంబంలో జరుగుతున్న ఒక కార్యక్రమంగా భావించి సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.. రాబోయే 3 – 4 రోజులు రాత్రి, పగలు కష్టపడి పని చేస్తేనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమన్నారు..సభా ప్రాంగణంలో పార్కింగ్ వద్ద 1-2 ర్యాంపు లు ఏర్పాటు చేయాలన్నారు. ఆహార పంపిణీతో.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిర్దేశిత ప్రాంతాల్లో భోజన ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలన్నారు.. దూర ప్రాంతాల నుండి సభకు వచ్చేవారికి ఆహార ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు.ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి ఏ వాహనం ఎక్కడికి వెళ్లాలనే విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. స్థానికంగా టోల్ గేట్స్ వల్ల ట్రాఫిక్ సమస్య  ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక రోజు పాటు టోల్ ఫీజు లేకుండా ఫ్రీగా ఓపెన్ చేయాలని  మంత్రి సూచించారు.రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు సాధారణ ప్రజానీకం కూడా వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రధాని పర్యటన ను అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టి కృషితో.విజయవంతం చేద్దామని తెలిపారు .   రేపటి నుండి సభ ప్రాంగణం ఎస్.పి.జి వారి ఆధ్వర్యంలో ఉంటుందని తెలిపారు..ఎస్.పి.జి సెక్యూరిటీకి సహకరించాలన్నారు. రోడ్డు పనులు త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ అందరి సహకారంతో ప్రధానమంత్రి పర్యటన ను విజయవంతం చేద్దామన్నారు.. 2004వ సంవత్సరంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఓర్వకల్లు వచ్చారని, 21 సంవత్సరాలు తర్వాత కర్నూలు జిల్లాకు ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయాలన్నారు.సమావేశంలో ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్, విజయ సునీత, శివ్ నారాయణ్, డా.బి.నవ్య, గణేష్ కుమార్, గీతాంజలి,  జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అన్నమయ్య జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి,  వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, టీడీపీ జిల్లా ఇంచార్జి  తిక్కా రెడ్డి,టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author