NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనసంద్రంగా మారిన మంత్రాలయం

1 min read

వరుస సెలవులు రావడం తో భారీ గా తరలివచ్చిన భక్తులు

కిక్కిరిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, తుంగభద్ర నది తీరం

భారిగా ధరలు పెంచిన ప్రైవేటు లాడ్జిల నిర్వహకులు

వాహనాలతో నిండిన ప్రధాన రహదారులు

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నియంత్రించిన పోలీసులు

మంత్రాలయం న్యూస్ నేడు :  వరుసగా సెలవులు క్రిస్మస్ పండుగ సెలవులు రావడం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు భక్తులు భారీ గా తరలిరావడం తో మంత్రాలయం జనసంద్రంగా మారింది. రాఘవేంద్ర స్వామి కి ఇష్ట దినమైన గురువారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వెళ్లగా రాఘవేంద్ర స్వామి మఠం భక్తులతో కిక్కిరిసింది. అలాగే పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు రావడం తో తుంగభద్ర నది తీరంలో భక్తుల కోలాహలం గా మారింది. భక్తులు అధిక సంఖ్యలో రావడం తో ఇదే అదునుగా భావించిన ప్రైవేటు లాడ్జిల నిర్వహకులు ఏకంగా ధరలను విపరీతంగా పెంచారు దీంతో భక్తులు అధిక ధరలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. ధరలను నియంత్రించే ఏ అధికారులు లేరని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు లాడ్జిలకు వాహనాలకు పార్కింగ్ లేక రోడ్ల పైనే వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలపడంతో ప్రధాన రహదారులన్ని వాహనాలతో నిండిపోయాయి. దీంతో సిఐ రామాంజులు ఆధ్వర్యంలో మంత్రాలయం ఎస్సై మల్లికార్జున తన పోలీసులు సిబ్బంది తో ట్రాఫిక్ సమస్య లేకుండా నియంత్రించారు. వచ్చిన భక్తులు రాఘవేంద్ర స్వామి ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

About Author