NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్షరయోధుడు.. సామాజిక విప్లవ సూర్యుడు మహాత్మా జ్యోతిబా ఫూలేకు

1 min read

ఆలూరులో టిడిపి నాయకుల ఆధ్వర్యంలో 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఆలూరు న్యూస్ నేడు : సామాజిక న్యాయం కోసం అచంచలంగా పోరాడిన మహనీయుడు, బాలికల విద్యా హక్కుకు పునాది వేసిన తొలి యోధుడు మహాత్మా జ్యోతిబా ఫూలే  200వ జయంతి సందర్భంగా ఆలూరులో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలూరు టిడిపి ఇంచార్జ్  వైకుంఠం జ్యోతి మరియు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ వైకుంఠం శివ ప్రసాద్  పాల్గొని జ్యోతిబా ఫూలే  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళల విద్యాభివృద్ధికి జ్యోతిబా ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, చైతన్యం, పురోగతి సాధ్యమని ఆయన చూపించిన మార్గం నేటికీ అందరికీ ఆదర్శమని తెలిపారు.”విద్య లేని వాడు వివేకం కోల్పోతాడు.. వివేకం లేని వాడు ప్రగతిని కోల్పోతాడు” అనే మహాత్మా ఫూలే సూక్తిని స్మరించుకుంటూ, యువత ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author