NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బండలాగుడు పోటీలో విజేత.. వనికే రాము వృషభాలు 

1 min read

మొదటి బహుమతి రూ 15,116, రెండో బహుమతి రూ 10, 116,మూడో బహుమతి రూ 5, 116

విజేత వృషభాల  ఊరేగింపు

మంత్రాలయం, న్యూస్​ నేడు  : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి 354 వ సప్త ఆరాధనోత్సవాలలో భాగంగా బుధవారం గ్రామ రైతుల అధ్వర్యంలో సంత మార్కెట్ లో తొలిసారిగా వంద కేజీల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఎంపిటిసి సభ్యులు మేకల వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు పులికుక్క రాఘవేంద్ర, టిడిపి నాయకులు  మంచాల సొసైటీ డైరెక్టర్లు డిసి తిమ్మప్ప, చెట్నహల్లి చాపల నాగేష్, వరదరాజు, అశోక్ రెడ్డి, వైసిపి నాయకులు కురువ మల్లికార్జున రైతులు బండలాగుడు పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో 9 జతలు వృషభాలు పాల్గొన్నాయి. ఇందులో మంత్రాలయం కు చెందిన వనికే రాము కు చెందిన వృషభాలు బండలాగుడు పోటీల్లో 15 నిమిషాల్లో 150 అడుగుల్లో 16 రౌండ్లు తిరిగి మొదటి విజేతగా నిలిచాయి. 14 రౌండ్లు తిరిగి రెండో విజేతగా ఈడిగ గోవింద్ కు చెందిన వృషభాలు నిలిచాయి. 13 రౌండ్లు తిరిగి మూడో విజేతగా కే గోవింద్ కు చెందిన వృషభాలు నిలిచాయి. మొదటి విజేత బహుమతి రూ 15,116, రెండో విజేత బహుమతి రూ 10, 116, రూ మూడో విజేత బహుమతి రూ 5, 116 నగదు వృషభాల చెందిన రైతులకు అందజేశారు. విజేతలుగా నిలిచిన వృషభాల ను గ్రామ పురవీధుల గుండా డప్పుల బాణాసంచా కాల్చి ఊరేగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రామాంజులు ఆధ్వర్యంలో ఎస్ఐ శివాంజల్ తమ పోలీసు సిబ్బంది తో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

About Author