కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు భద్రత లేదు..
1 min read

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి మండిపడ్డారు…!!!
కర్నూలు , న్యూస్ నేడు : ఓర్వకల్లు మండలం శ్రీ భ్రమరాంబ బుగ్గ రామేశ్వర స్వామి (కాల్వబుగ్గ) ఆలయంలో చోరీ జరగడం పై ఆందోళన వ్యక్తం చేశారు… ఆలయంలో దాదాపుగా 10కేజీల వెండి ఆభరణాలు దొంగలిస్తే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు… చోరీ పై పోలీసులు విచారణ చేపట్టి తక్షణమే రికవరీ చేయాలని డిమాండ్ చేశారు… రాష్ట్రంలో ఒకవైపు డ్రక్స్ మరోవైపు ఆలయాల్లో అపచారాలు కొనసాగుతున్నాయని, తక్షణమే వీటిని ఆరికట్టాలని లేదంటే కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి …!!!ఈ కార్యక్రమంలో ఓరకల్లు మండల నాయకులు కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మీది వేముల ప్రభాకర్ రెడ్డి , జడ్పీటీసీ రంగనాథ్ గౌడ్ ,ఎంపీపీ తిప్పన్న , సర్పంచులు వెంకటేశ్వర్లు , తిప్పాయపల్లె హరినాథ్ రెడ్డి ,గంగాధర్ రెడ్డి , శీను నాయక్ నాయకులు హుసేనాపురం యువరాజు , రమణా రెడ్డి , మధుగారు, శకునాల పుల్లారెడ్డి , మద్దిలేటి నాయక్, బాకర్సా, రసూల్ , రమేష్, భాస్కర్, అనిల్, ప్రభు, వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంత రెడ్డి ,లక్ష్మీ రెడ్డి ,ఎరుకల వెంకటేశ్వర్లు నాయకులు పందిపాడు శివ శంకర్ రెడ్డి ,ఎద్దుల శివారెడ్డి ,తిరుపాల్ ,కేశవ , బీమ శంకర్ రెడ్డి ,పల్లె మధు మోహన్ రెడ్డి,సాయి ,జగదీశ్వర రెడ్డి నంద్యాల యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి ,నంద్యాల జిల్లా పంచాయతీ రాజ్ అధ్యక్షులు రామలక్ష్మయ్య , చాంద్ భాష వైఎస్ఆర్టియుసి ప్రెసిడెంట్ నంద్యాల, సుమంత్ రెడ్డి నంద్యాల జిల్లా ట్రెజరీ, సద్దల చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నాయకుడు గగ్గటూరు, సంపంగి నాగేంద్ర స్టేట్ బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

