నిర్దేశించిన గడువులోపు ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలి
1 min read

రైతుల తలసరి ఆదాయం పెంచడానికి మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి మరియు అరటి వంటి పంటలను సాగు చేయించాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణ వ్యవసాయ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులను ఆదేశించారు..శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ క్రాప్ బుకింగ్, రైతు సేవా కేంద్రాల యాక్షన్ ప్రణాళిక తదితర అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులతో, మండల వ్యవసాయ శాఖ అధికారులతో, రైతు సేవ కేంద్రం అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఉల్లి, పత్తి పంటల సేకరణలో ఎదురైన సాంకేతిక మరియు ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని, రాబోయే కందులు, శనగలు, మిర్చి పంటల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు… పంట సేకరణ ప్రక్రియలో రైతులు ఇబ్బంది పడకుండా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడడమే తన ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.. రైతులు సాగు ప్రారంభం చేసినప్పటి నుండి పంట మార్కెటింగ్ వరకు ఎదుర్కొనే ప్రతి అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి సమస్యలకు ముందస్తు పరిష్కారాలతో కూడిన స్పష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఆయా మండలాల్లో పండే పంటల ఆధారంగా కోల్డ్ స్టోరేజీలు, పాలీ హౌస్లు, ప్యాక్ హౌస్లు, సోలార్ కోల్డ్ రూమ్స్, మరియు డ్రైయర్ల ను ప్రోత్సహించాలని కలెక్టర్ వ్యవసాయ అనుబంధ అధికారులను ఆదేశించారు… యూరియా కి సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు.సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారి రాజాకృష్ణ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అరుణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

