బదిలీ పొందిన ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలి
1 min read

యస్. టి. యు .డిమాండు
పత్తికొండ, న్యూస్ నేడు: బదిలీ పొందిన ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్లు కొత్తపల్లి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం పత్తికొండ పట్టణంలో రెండవ రోజు వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల నుండి సమస్యల సేకరణ ,సభ్యత్వ స్వీకరణ కార్యక్రమాన్ని ఎస్టియు చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎస్.టి.యు.రాష్ట్ర కౌన్సిలర్లు కొత్తపల్లి సత్య నారాయణ,నారాయణ,జిల్లా ఆర్థిక కార్యదర్శి ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి,మండల అధ్యక్ష కార్యదర్శి చంద్ర శేఖర్,బలరాం ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల నుండి సేకరించిన సమాచారం మేరకు ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్షల నుండి మినహాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండు చేసారు. బదిలీ పొందినప్పటికీ రిలీవర్లు లేక ఇంకనూ రిలీవ్ కాని వారిని తక్షణమే రిలీవ్ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.డీఎస్సీలో పాఠశాలల్లో చేరిన వారికి జీతాలు ఆలస్యం కాకుండా వెంటనే పొజిషన్ ఐడీలు కేటాయించి, జీతాలు వెంటనే వచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ టి యు నాయకులు చెన్న కేశవరావు, కౌలుట్లయ్య,హల్తెన్న,వెంకటేశ్వర్లు, వెంకటేష్ నాయక్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

