NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దివంగత ఇద్దరు పారిశ్రామికవేత్తలకు ఘనంగా నివాళులు

1 min read

ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారతరత్న డా:జె.ఆర్.డి టాటా,ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపక అధినేత

డా:ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ చిత్రపటాలకు ఘన నివాళులు

సర్ సి.ఆర్.ఆర్.రెడ్డి గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో  జయంతి వేడుకలు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న పారిశ్రామికవేత్త శ్రీ శ్రీనివాస మైన్స్ అండ్ మినరల్స్ మోగటదాకల  శ్రీనివాసరావు

విద్యార్థి దశనుండే నిర్ణయాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి

వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : స్థానిక సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల సి.ఐ.ఐ.ఈ, ఈ.డి.సి,యం.బి.ఏ. యం.కాం.మరియు ఐ.క్యూ.ఎ.సి. వారి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం  ప్రముఖ పారిశ్రామికవేత్తలైన ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపక అధ్యక్షులైన డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్  104వ జయంతి మరియు టాటా గ్రూపుల వ్యవస్థాపక అధ్యక్షులైన భారతరత్న జె.ఆర్.డి.టాటా 121వ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా దివంగత ఇద్దరు పారిశ్రామికవేత్తల చిత్రపటాలకు  పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారకాతిరుమలలోని శ్రీ శ్రీనివాస మైన్స్ అండ్ మినరల్స్ చైర్మన్ మోగటదాకల శ్రీనివాస రావు  మాట్లాడుతూ విద్యార్థిదశ నుండే మంచి నిర్ణయాత్మకమైన ఆలోచనతో మరియు నిర్దేశించిన ప్రణాళికతో ముందుకు సాగాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారని అలాంటి వారిలో ముఖ్యలు మన ప్రముఖ పారిశ్రామికవేత్తలైన ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరియు భారతరత్న జె.ఆర్.డి. టాటా ని మనం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మన దేశ మరియు రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార, సామాజిక, అభివృద్దికి ఎనలేని సేవలు అందించి మనకు మార్గదర్శకులైనారని అన్నారు. ద్వారకాతిరుమలలో మొట్టమొదట మైనింగ్ వ్యాపారం మా నాన్న గారు మొదలుపెట్టినప్పుడు రవాణా, బ్యాంకింగ్, మానవ వనరులు మొదలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కాని మీకు మీకు ఇప్పుడు అనేకమైన అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనుండి ప్రోత్సాహకాలు అందుతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విలువలతో కూడిన వ్యాపారాలనే వినియోగదారులు ఎక్కువ కాలం మార్కెట్లో ఆదరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో  మేనేజింగ్ డైరెక్టర్ యం.లక్ష్మీ రమణీ యం.బి.ఏ. విద్యార్థులు వివిధ అంశాలైన వ్యాపారలు, రైతులు, వినియోగదారులు మరియు సామాజిక, సాంఘిక  అంశాలపై ఎదుర్కొంటున్న సమస్యలపై మినీ  పరిశోధనలు చేసి కళాశాలకు సమర్పించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పి.జి. కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాస రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఎ.రామరాజు, పి.జి. కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి.ఆర్.యస్. బాబు యలమర్తి,  సి.ఐ.ఐ.ఇ ఈ.డి.సి. కో- ఆర్డినేటర్ డాక్టర్ తేర రాజేష్, యం.బి.ఎ. డైరెక్టర్ డాక్టర్ రంగు శ్రీనివాస రావు, ఐ.క్యూ.ఏ.సి. కో- ఆర్డినేటర్ డాక్టర్ జి.రాము, యం.బి.ఏ. ఆచార్యులు డాక్టర్ వై.సౌజన్య, అధ్యాపకులు యం.ఉపేంద్ర, పి.హె.యన్.యస్.వి. సుబ్బారావు, యస్.శ్రీలత జి.వి.రవీంద్ర బాబు, వి.శ్రీనివాస రావు, పి.అపర్ణ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చిన ముఖ్య అతిథులకు కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు.

About Author