తల్లి మృతితో కుమారునికి రెండు లక్షల బీమా
1 min read

చెక్కును అందజేసిన ఏపీజీబీ మేనేజర్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామానికి చెందిన గంధం కర్ణమ్మ (30) అనారోగ్య కారణంగా మృతి చెందడంతో ఆమె కుమారుడు నామినీ అయిన రెడ్డి పోగు సంజీవ్ కుమార్ కు రెండు లక్షల బీమా చెక్కును అందజేసినట్లు గార్గేయపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎస్ అన్వర్ భాష తెలిపారు.బ్యాంక్ మేనేజర్ తెలిపిన వివరాల మేరకుకర్ణమ్మ ఏపీజీబీ బ్యాంకులో ప్రధానమంత్రి జీవనజ్యోతి ఇన్సూరెన్స్ కింద 336 రూ.లు తన కుమారుని నామినీ మీద ఇన్సూరెన్స్ చెల్లించారు.ఆ తర్వాత గత ఆరు నెలల క్రితం కర్ణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.సోమవారం మధ్యాహ్నం గార్గేయపురం బ్యాంకులో మేనేజర్ మరియు సహాయ మేనేజర్ పద్మావతి మృతురాలి కుమారునికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.కుటుంబ సభ్యులు బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది స్వాతి,వందిత,బిసీ నభి రసూల్,వివోఏ రంగస్వామి,మైమాకర్ మరియు నాయకులు శబ్బు, నరసింహ గౌడ్ పాల్గొన్నారు.

