శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం లో తితిదే ధార్మిక కార్యక్రమాలు ప్రారంభం
1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తి.తి.దే.
కర్నూలు, న్యూస్ నేడు: పవిత్ర మాఘమాసాన్ని పురస్కరించుకొని నందికొట్కూరు పట్టణం, కోటవీధిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి మరియు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను స్థానిక భక్త సమాజంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంగళవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు స్థానిక భక్త సమాజంచే భజనలు, ఆదిత్యహృదయం పారాయణం, తెలుగు పండితులు మరియు ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చిన్నావుల వేంకట రాజారెడ్డిచే శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు విరివిగా పాల్గొనగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నాగభూషణ శర్మ, స్కాలర్స్ పాఠశాల కరెస్పాండెంట్ కాళ్ళురి లక్ష్మి, ధార్మిక సంస్థల ప్రతినిధులు అల్వాల బాలయ్య, జి.భాస్కర రెడ్డి, బి. రమణ రెడ్డి, శెట్టి రవీంద్ర ప్రసాద్, బి.సురేశ్, కాంతారెడ్డి, మోహన్ రెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎ. శివశంకర రెడ్డి, శ్రీ సుధా విద్యాసంస్థల అధినేత సుధాకర రెడ్డితో పాటు ఆదిత్య హృదయం పారాయణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

