NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగిసిన ద్విచక్ర వాహనాల వేలంపాట

1 min read

వేలం పాటలో 2,54,989 రూ.ల ఆదాయం

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  ద్విచక్ర వాహనాల వేలం పాటలో 2,54,989 రూ.లు ఆదాయం వచ్చినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు.జిల్లా ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి. రాముడు ఆధ్వర్యంలో శనివారం ఉ 10 గంటలకు నందికొట్కూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ అయిన 8 వాహనాలకు వేలం పాట నిర్వహించినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు.వేలం పాటలో  ఔత్సాహికులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయించిన ధర రూ.1,30,500 కాగా వేలంలో రూ.2,16,100 పాడగా దాని మీద అదనంగా జీఎస్టి 38,898 రూ వెరసి మొత్తం 2,54,989 వసూలు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ మోహన్ రెడ్డి,ఎస్ఈ జఫురుల్లా మరియు సిబ్బంది శంకర్ నాయక్,పద్మనాభం, మధుసూదన్ ప్రసాద్, శ్వేతారాణి,రమిజాబీ పాల్గొన్నారు.

About Author