NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాణ్యతతో తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయాలి..

1 min read

సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్  డిమాండ్..

ఓర్వకల్లు, న్యూస్​ నేడు: ప్రభుత్వ అదనపు తరగతి గదుల నిర్మాణాలను నాణ్యతతో నిర్మించాలని కర్నూలు జిల్లా సీపీఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జిల్లా పరిషత్ పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలలో నిర్మాణం చేపడుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణాలను శనివారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ కస్తూర్బా మరియు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు సరిపడా గదులు  లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదనపు గదుల నిర్మాణం కొరకు పనులు జరుగుతున్నాయని త్వరగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బి నాగన్న,మండల కమిటీ సభ్యులు జి శ్రీధర్,మధుసూదన్,మల్లేష్, శ్రీరాములు పాల్గొన్నారు.

About Author