ఘనంగా ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలు!
1 min read

ఆదివాసులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు!
దేవరకొండ వెంకటేశ్వర్లు
విజయవాడ, న్యూస్ నేడు: ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం, గాంధీనగర్, ప్రెస్ క్లబ్ లో ఆదివాసి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచం మనుగడకు ఆదివాసీలు మూల కారణమన్నారు. ఆదివాసిని అన్ని వర్గాలు, కిందకు అనగదొక్కి అభివృద్ధి చెందకుండా రాజకీయ నాయకులు పరిపాలన కొనసాగిస్తున్నారని కేవలం ఓటు బ్యాంకు కోసమే ఆదివాసిని వినియోగిస్తున్నారే తప్ప దేశంలో ఆదివాసులపై జరుగుతున్న దాడులను నియంత్రణ చేయట్లేదని ఆవేదన వ్యక్తపరిచారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా..సరే ఆదివాసీలు ఇప్పటికీ కూడా అనాగరికులుగా ఉండిపోయారని, ఇప్పటికైనా స్పందించి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు ఆదివాసులకి ప్రత్యేక సంక్షేమ భవనాలు ఏర్పాటు చేసి ఆదివాసుల్ని అభివృద్ధి బాట నడిపించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో మహిళలు పురిటి నొప్పులతో బాధపడుతుంటే వాళ్ళని డోలులో మూసుకొని వెళ్లి పట్టణ ప్రాంతా హాస్పిటల్ లో జాయిన్ చేయవలసి వస్తుందని అదే ఆదివాసీలకు ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో ఆధునిక హాస్పటల్ లను నిర్మించి వైద్య సదుపాయం అందించాలని మనవి చేశారు. ఆదివాసుల మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించి అలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు. చట్టసభలలో స్థానం కల్పించాలని, ఆదివాసి మహిళల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీల మహిళా సంఘాల అధ్యక్షులు సునీత తదితరులు పాల్గొన్నారు.

